TG: చారిత్రక బతుకమ్మ కుంట పునరుద్ధరణలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నానని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. 14 ఎకరాలు ఉన్న ఈ కుంట 6 నెలల క్రితం పూర్తిగా కబ్జాకు గురై చెత్తకుప్పలా ఉండేదన్నారు. 1955కి ముందు ఇక్కడ చెరువు ఉండేదని స్థానికులు ఇచ్చిన ఫోటోలు నిదర్శనమన్నారు. బతుకమ్మ కుంటాను పునరుద్ధరించినట్లే HYDలోని చాలా చెరువులను అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు.