Virupaksha Director los mobile producer lose purse
Virupaksha Director:ఇటీవల రిలీజ్ అయిన ‘విరూపాక్ష’ (Virupaksha) మూవీ మంచి టాక్ అందుకుంది. సుకుమార్ (sukumar) శిష్యుడు కార్తీక్ వర్మ దండు (karthik) ఈ మూవీని తెరకెక్కించగా.. బీవీఎస్ఎన్ ప్రసాద్ (prasad) సినిమా నిర్మించారు. తొలుత డివైడ్ టాక్ రాగా.. ఆ తర్వాత మాత్రం సినిమా దూసుకెళుతోంది. సినిమా థియేటర్లలో ప్రేక్షకుల స్పందన చూసేందుకు డైరెక్టర్ కార్తీక్, ప్రొడ్యూసర్ ప్రసాద్ వెళ్లారు. అక్కడ వారికి చేదు అనుభవం ఎదురయ్యింది.
సినిమా చూసి ప్రేక్షకులు ఎలా థ్రిల్ అవుతున్నారో తెలుసుకునేందుకు థియేటర్లకు వెళ్లారు. హైదరాబాద్లో మల్టీప్లెక్స్, థియేటర్లకు వెళ్లారు. ఓ థియేటర్ వద్ద కార్తీక్ (karthik) మొబైల్ మిస్ అయ్యిందట. అక్కడే నిర్మాత ప్రసాద్ (prasad) పర్స్ కూడా పోయిందట. మొబైల్, పర్స్ మిస్ అయ్యిందని వివరించారు.
థియేటర్స్లో జనాల రెస్పాన్స్ (response) చూసి కార్తీక్ ఆనందించి ఉంటారు. అందుకే మెల్లిగా ఫోన్ కొట్టేశారు. మరొకడు నిర్మాత పర్స్ (purse) తీసుకున్నాడు. దీంతో ఇద్దరు విలువైన వస్తువులను కోల్పోయారు. పోతే పోయినవి కానీ.. మంచి పబ్లిషిటీ వచ్చిందని నెటిజన్లు (netizens) అంటున్నారు. ప్రసాద్ నిర్మాత (producer) అయినందున పర్స్ తీసుకున్నారని మరికొందరు సరదాగా అంటున్నారు. సినిమాకు హిట్ టాక్ వచ్చింది. మొబైల్, పర్స్ పోయిన ఫర్వాలేదు అనే ధీమాలో ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఉండి ఉంటారు.