కోనసీమ: రాజోలు మండలం ములికిపల్లి వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప.గో జిల్లా యలమంచిలి మండలం కలగంపూడికి చెందిన కడలి అక్షయ (21) మృతి చెందాడని ఎస్ఐ రాజేశ్ కుమార్ తెలిపారు. చెన్నైలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న అతడు బయటకు వెళ్తున్నానని ఇంటి వద్ద చెప్పి వచ్చి, బుల్లెట్‌పై వెళ్తూ లారీని ఢీ కొని మరణించినట్లు వెల్లడించారు.