E.G: నల్లజర్ల మండలం పుల్లలపాడులో ఆదివారం ఓ కారు అదుపుతప్పి నడిచి వెళ్తున్న భవాని భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు భవానిలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు నక్కపల్లి మండలం దోసపాడుకి ప్రకృతి శివ (35), ప్రకృతి సీను (25)గా గుర్తించారు. వెస్ట్ బెంగాల్‌కు చెందిన ఐదుగురు వైజాగ్ నుంచి హైదరాబాదు కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.