KDP: సూపర్ సిక్స్ హామీలు సూపర్ హిట్ అని అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమని ఆదివారం వేంపల్లిలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసి రెడ్డి మాట్లాడుతూ.. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్ వంటి పథకాలను అమలు చేయకుండానే సూపర్ సిక్స్, సూపర్ హిట్ అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.