KDP: దసరా సెలవులకు వెళ్లే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఒంటిమిట్ట CI బాబు అన్నారు. ఆదివారం సిద్ధవటంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడారు. దసరా పండుగకు తమ సొంత గ్రామాలు, విహారయాత్రలకు వెళ్లేవారు చోరీల నియంత్రణకు జాగ్రత్తగా ఉండాలన్నారు. విలువైన బంగారు, వెండి ఆభరణాలు, బ్యాంకు లాఖరులో భద్రపరుచుకోవాలన్నారు. అనుమానిత వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు తెలపాలన్నారు.