రౌడీషీటర్లు(Rowdysheeters), అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారికి చెక్ పెట్టేందుకు పోలీసులు(police) నగర బహిష్కరణ చేస్తుంటారు. తాజాగా విజయవాడ(Vijayawada)లో మొదటిసారి ఓ లేడీ కిలాడీని నగర బహిష్కరణ చేశారు. సారమ్మ(Saaramma) అలియాస్ శారద అనే మహిళపై ఇప్పటి వరకూ విజయవాడలో 13 కేసులు ఉన్నాయి. నగరంలో సారమ్మ గంజాయి(marijuana) అమ్ముతూ అనేక వివాదాల్లో ముఖ్య పాత్ర పోషించింది. పోలీసుల కల్లుగప్పి సారమ్మ అనేక దందాలు నడిపింది.
పోలీసులు(Police) సారమ్మ(Saaramma)కు చాలా సార్లు హెచ్చరికలు జారీ చేశారు. ఆమెపై ఎన్ని కేసులు పెట్టినా కూడా ఆమె తీరు మాత్రం మారడం లేదు. దీంతో ఆఖరికి ఆమెను నగర బహిష్కరణ చేశారు. ఆమెతో పాటుగా మరో 19 మందిని విజయవాడ(Vijayawada) సిటీ నుంచి బహిష్కరిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. విజయవాడలో ఇటీవలె గంజాయి కేసులు ఎక్కువవుతున్నాయి. గంజాయి విక్రయాలపై ఉక్కపాదం మోపేందుకు పోలీసులు గట్టి చర్యలు చేపట్టారు.
విజయవాడ(Vijayawada) చరిత్రలోనే మొదటిసారి ఓ మహిళకు నగర బహిష్కరణ శిక్ష వేశారు. ఆమెతో పాటుగా మరో 19 మందికి ఆ శిక్షను అమలు పరిచారు. మరోసారి వారంతా గంజాయి(marijuana) కేసుల్లో దొరికితే కఠినంగా శిక్షిస్తామని సీపీ క్రాంతి రాణా టాటా(CP kranti Raana tata) వార్నింగ్ ఇచ్చారు. రాబోయే రోజుల్లో గంజాయి అనేదే అస్సలు కనిపించకూడదని, ఆ దందాను అంతం చేసే పనిలో పోలీసులు పడ్డారు. దొరికిన వారిని దొరికినట్లుగా అరెస్ట్(Arrest) చేసి వారికి తగిన శిక్షను విధిస్తున్నారు.