ఈ ఏడాదిలో ఇప్పటివరకు రిలీజైన సినిమాల్లో కొన్ని విజయం సాధించగా.. మరికొన్ని ఫ్లాప్ అయ్యాయి. అయితే సెప్టెంబర్ నెల పలు మూవీలకు కలిసొచ్చింది. ఈ నెలలో రిలీజైన 4 సినిమాలు సూపర్ హిట్ అందుకున్నాయి. ‘లిటిల్ హార్ట్స్’, ‘కిష్కింధపురి’, ‘మిరాయ్’, ‘OG’ సినిమాలు మంచి విజయం సాధించాయి. దీంతో నెటిజన్లు తెలుగు సినిమాలకు సెప్టెంబర్ లక్కీ మంత్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.