AP: కర్నూలు జిల్లా హోళగుంద మండలం దేవరగట్టు మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్ని ఉత్సవాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే, గ్రామంలో కొలువైన ఉత్సవమూర్తులను దేవరగట్టుకు తరలించే వరకు దసరా ముందునుంచి 15 రోజులపాటు ఆ గ్రామంతో సహా మరో రెండు గ్రామాల ప్రజలు కఠోర దీక్ష బూనారు. మద్యం ముట్టరు.. మాంసం తినరు.. చెప్పులు వేసుకోరు.. కటిక నేలపై నిద్రిస్తారు.