»In Madhya Pradesh A Husband Kills His Wife Lover For Having An Immoral Relationship
Madhya Pradesh : పక్కింటివాడితో పెళ్లాన్ని చూసి తట్టుకోలేక.. భర్త షాకింగ్ డెసిషన్
భర్త హఠాత్తుగా ఇంటి(house)కి వచ్చాడు. ఇంట్లోకి అడుగుపెట్టిన వెంటనే పొరుగింటి వాడితో ఉన్న భార్యను చూసి భర్తకు కోపం వచ్చింది. ఆ వెంటనే అతను తన భార్య ప్రేమికుడు రాజ్రూప్ బైగాపై పదునైన ఆయుధంతో దారుణంగా దాడి చేశాడు.
Madhya Pradesh : మధ్యప్రదేశ్లో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య అనైతిక సంబంధాని(Immoral Relationship)కి కోపోద్రిక్తుడైన భర్త ఆమె ప్రేమికుడి(Lover)ని హతమార్చిన ఘటన సిద్ధి జిల్లా(Siddi District)లో చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడైన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు(Police)ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన వ్యక్తి నిందితుడి ఇంటి పక్కనే నివసిస్తుండేవాడు. గత కొన్ని రోజులుగా నిందితుడి భార్యతో అనైతిక సంబంధం(Immoral Relationship) కొనసాగిస్తున్నాడు. అయితే ఈ విషయం నిందితుడికి తెలియదు. చివరకు ఈ విషయం తెలుసుకున్న భర్త(Husband) ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
దాదులాల్ బైగా, అతని భార్య కూలిచేసుకుంటూ జీవితం గడుపుతుండేవారు. కూలి పనుల నిమిత్తం భర్త ఇంటి నుంచి వెళ్లేవాడు. దీనిని సద్వినియోగం చేసుకున్న అతని భార్య పొరుగువాడైన రాజ్రూప్ బైగాతో అక్రమ సంబంధాన్ని ప్రారంభించింది. అయితే చాలా కాలం భర్తకు తెలియకుండా రహస్య సంబంధం కొనసాగించారు. గురువారం రాత్రి 12 గంటల సమయంలో భర్త హఠాత్తుగా ఇంటి(house)కి వచ్చాడు. ఇంట్లోకి అడుగుపెట్టిన వెంటనే పొరుగింటి వాడితో ఉన్న భార్యను చూసి భర్తకు కోపం వచ్చింది. ఆ వెంటనే అతను తన భార్య ప్రేమికుడు రాజ్రూప్ బైగాపై పదునైన ఆయుధంతో దారుణంగా దాడి చేశాడు.
ఈ దాడిలో రాజ్రూప్కు తీవ్ర గాయాలయ్యాయి. ఎలాగోలా ప్రాణాపాయ స్థితిలో తన ఇంటికి చేరుకున్నాడు. అతని అరుపులు విన్న తల్లి(Mother) ఇంట్లోంచి బయటకు వచ్చింది. దాడి గురించి రాజ్రూప్ తన తల్లికి తెలియజేశాడు. దీని తరువాత అతను మరణించాడు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు(police) తదుపరి విచారణ జరుపుతున్నారు.