ఒక్క సినిమా హిట్ కొడితేనే.. ఆయా డైరెక్టర్స్ రేంజ్ అంతకుమించిపోతోంది. ఇక బ్యాక్ టు బ్యాక్ మాసివ్ హిట్స్ ఇస్తే.. ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ క్రేజ్ కూడా అలాగే ఉంది. ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాలతో.. సాలిడ్ కంటెంట్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు లోకేష్. అందుకే ఈ టాలెంటెడ్ డైరెక్టర్ నెక్ట్స్ ఫిల్మ్ కోసంగా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు అభిమానులు.
అది కూడా ఇళయ దళపతితో మరోసారి భారీ ప్రాజెక్ట్ చేస్తుండడంతో.. అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘వరిసు’ అనే సినిమాలో నటిస్తున్నాడు విజయ్. తెలుగులో ఈ చిత్రం ‘వారసుడు’గా రాబోతోంది. ఇక ఈ చిత్రం తర్వాత లోకేష్ కనగరాజ్‌తో 67వ సినిమా చేయబోతున్నాడు విజయ్.
డిసెంబర్లో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ ప్రకటించారో.. అప్పటి నుంచి ఈగర్‌గా వెయిట్ చేస్తున్నామంటూ.. సోషల్ మీడియాను హీటెక్కిస్తునే ఉన్నారు విజయ్ ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో ఇప్పుడో వార్త హల్ చల్ చేస్తోంది. అప్పుడే ఈ సినిమా భారీ ఓటిటి ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. విజయ్-లోకేష్ కాంబో అన్నప్పుడే..
ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు నెక్ట్స్ లెవల్‌కి వెళ్లాయి. అందుకే ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్.. దళపతి 67 స్ట్రీమింగ్ హక్కులను రికార్డు ధర చెల్లించి సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. కొందరు 100 కోట్లకు పైగా ఈ ఆఫర్ ఉందని చెబుతుంటే.. ఇంకొందరు 160 కోట్లు అంటున్నారు. ఇలాంటి వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియదు గానీ..
ఈ క్రేజీ కాంబో మాత్రం రికార్డులు తిరగరాయడం ఖామంటున్నారు. అయితే ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఇంకా ఈ సినిమా సెట్స్ పైకి కూడా వెళ్లకముందే.. ఓటిటి ఆఫర్ గురించి చర్చ జరుగుతోంది. కాబట్టి ఇప్పుడే ఇలాంటి విషయాల్లో క్లారిటీ ఇవ్వలేం.