ATP: గుత్తిలోని కటిక వీధిలో గురువారం తెల్లవారుజామున కటిక కరీం అనే వ్యక్తికి చెందిన ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. బాధితుడు కటిక కరీం మాట్లాడుతూ.. ఇంటి బయట పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ పోసి నిప్పట్టించారన్నారు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.