WGL: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల రిజర్వేషన్లపై రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. MPTC, ZPTC, ZP ఛైర్మన్ పదవులపై వివిధ పార్టీల అగ్ర నాయకులు దృష్టి సారించారు. కాగా ఉమ్మడి జిల్లాలో 778 ఎంపీటీసీ, 75 ZPTC స్థానాలు ఉన్నాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడంతో నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.