AKP: బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు వెనక్కి తగ్గేదే లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం అప్పలరాజు స్పష్టం చేశారు. బుధవారం రాత్రి రాజయ్యపేటలో మాట్లాడుతూ 11 రోజులుగా శాంతియుతంగా రిలే దీక్షలు చేస్తున్నా, హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించకపోవడంతో పోరాటాన్ని మత్స్యకారులు ఉధృతం చేసినట్లు తెలిపారు.