E.G: ఎర్నగూడెం-త్యాజంపూడి రోడ్డుకు మోక్షం లభించింది. ఎన్నో ఏళ్లుగా అధ్వానంగా ఉన్న ఈ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని ఎమ్మెల్యే ఆదేశించడంతో అధికారులు పనులు బుధవారం ప్రారంభించారు. దీంతో స్థానికులు, వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా పనులు పూర్తి చేసి ప్రయాణాన్ని సులభతరం చేయాలని కోరుతున్నారు.