భారత్-ఎ, ఆస్ట్రేలియా-ఎ మధ్య రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్-ఎ 194 పరుగులకే ఆలౌట్ అయింది. సాయి సుదర్శన్ 75 పరుగులతో అద్భుత ప్రదర్శన చేశాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా-ఎ 420 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియా-ఎ జట్టు తొలి ఇన్నింగ్స్లో 226 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. కాగా, తొలి టెస్టు డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే.