ప్రకాశం: నాగులుప్పలపాడు మండలం చేకూరపాడు గ్రామాన్ని జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) వెంకటేశ్వరరావు మంగళవారం సందర్శించారు. శుభ్రత కార్యకలాపాలను సమీక్షించి సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేశారు. ఇంటింటి చెత్త సేకరణ వ్యవస్థను పరిశీలించారు. ఎస్సీ కాలనీలలో తప్పనిసరిగా కాలువలు శుభ్రం చేయాలని సిబ్బందిని ఆదేశించారు.