MLG: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ములుగు జిల్లాలోని మేడారంకు చేరుకున్నారు. సీఎంకు ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు కొండా సురేఖ, దనసరి అనసూయ (సీతక్క) లు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారు గద్దెల వద్దకు చేరుకొని వనదేవతలను దర్శించుకున్నారు. అలాగే అమ్మవార్లకు మొక్కులు చెల్లించారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు మేడారంలో భారీ బందోబస్తు నిర్వహించారు.