SRCL: దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రుద్రంగి మండల కేంద్రంతో పాటు మానాల, గిరిజన గ్రామపంచాయతీలో యువజన సంఘాలు, యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దుర్గామాత విగ్రహాలను సోమవారం ఘనంగా ప్రతిష్టించారు. మండల కేంద్రంలోని మహాలక్ష్మి, ఇందిరా చౌక్, అంబేద్కర్ వీధిలోని దుర్గమ్మకు యూత్ ఆధ్వర్యంలో దుర్గామాతను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేశారు.