KMM: కొనిజర్ల మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు రంజిత్ సోమవారం జిల్లా కలెక్టర్ అనుదీప్‌కు వినతి పత్రం అందజేశారు. రంజిత్ మాట్లాడుతూ.. పెద్దగోపతి గ్రామంలో సర్వేనెంబర్ 319లో గల 12 ఎకరాల ప్రభుత్వ భూమినీ అనంతారం, బోట్లకుంట గ్రామాలకు చెందిన నిరుపేద ఎస్సీ, బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికి ఇవ్వాలని కోరారు. దీనినిపై కలక్టర్ సానుకూలంగా స్పందించారు.