HimanshU Rao Praises His Grandfather Rule In Telangana
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవుడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు అందరికీ తెలిసే ఉంటుంది. చాలా సార్లు… హిమాన్షు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా హిమాన్షు శరీరాకృతిపై చాలా మంది కామెంట్స్ చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్ పలు సందర్భాల్లో తీవ్రంగా స్పందించారు. తన కుమారుడిపై కొందరు అసభ్యకరంగా మాట్లాడుతున్నారని బహిరంగంగానే తన ఆవేదనను వ్యక్తం చేశాడు.
ఆ తర్వాత ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టిన హిమాన్షు అనుహ్యంగా బరువు తగ్గారు. తనను ట్రోల్ చేసే వారికి దిమ్మతిరిగేలా కఠోర శ్రమతో బరువును తగ్గించుకున్నారు. ఇక ఓ నెటిజన్ హిమాన్ష్ రీసెంట్ ఫోటోను పోస్టు చేశాడు.
‘సడెన్‌గా చూసి కేటీఆర్ అన్న అని అనుకున్నా’ ఆ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చాడు. ఆ పోస్టుకు హిమాన్షు రావు తనదైన శైలిలో రిప్లై ఇచ్చాడు. హీరో బాలకృష్ట డైలాగ్‌ను కోట్ చేస్తూ.. ‘సర్సర్లే ఎన్నెన్నో అనుకుంటా.., అన్నీ జరుగుతాయా ఏంటీ’ అంటూ రిఫ్లై ఇచ్చాడు.
ఇలా హిమాన్షు బాలయ్య డైలాగ్ కొట్టడం అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. హిమాన్షు పోస్టు వైరల్ గా మారింది.