»Today Is World Liver Day April 19th 2023 Do You Know About Protecting Your Liver
World Liver Day 2023: నేడు ప్రపంచ కాలేయ దినోత్సవం..మీ లివర్ సరక్షణ గురించి తెలుసా?
మన శరీరంలో రెండో పెద్ద అవయవంగా ఉన్న కాలేయం గురించి తెలుసుకోవడం తప్పనిసరి. ఎందుకంటే ఇటీవల కాలంలో దీని సంబంధిత వ్యాధులు కూడా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 19ని ప్రపంచ కాలేయ దినోత్సవం(World Liver Day)గా పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాలేయ గురించి ఈరోజు తెలుసుకుందాం.
ఈరోజు (ఏప్రిల్ 19) ప్రపంచ కాలేయ దినోత్సవం (World Liver Day). అయితే సాధారణ ప్రజలలో కాలేయ వ్యాధి గురించి అవగాహన పెంచే ఉద్దేశ్యంతో ప్రతి ఏటా ఏప్రిల్ 19న ప్రపంచ ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కాలేయ వ్యాధుల తీవ్రత, ముందస్తుగా గుర్తించడం, నివారణ గురించి ప్రజలకు అవగాహన కల్పించే కార్యకలాపాలపై దృష్టి సారిస్తున్నారు.
2023 వరల్డ్ లివర్ డే థీమ్ “జాగరూకతతో ఉండండి. రెగ్యులర్ గా లివర్ సమస్యల గురించి చెక్ అప్ చేయించుకోండి. ఊబకాయం (అధిక బరువు), ఇన్సులిన్ నిరోధకత (మధుమేహం), ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం వంటి కారకాలతో లివర్ వ్యాధులు సంభవిస్తున్నాయి. కాబట్టి రెగ్యులర్ లివర్ చెక్ అప్ల అంశాన్ని ఈ ఏడాది నొక్కి చెప్పడంపై థీమ్ దృష్టి సారిస్తుంది.
అయితే మానవ శరీరంలో రెండో అతిపెద్ద, అత్యంత కీలకమైన అవయవం కాలేయం. జీవక్రియ, జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి, టాక్సిన్స్ వడపోత, విటమిన్లు, ఖనిజాలు, గ్లూకోజ్ మొదలైన వాటి నిల్వ వంటి అనేక విధులను ఇది నిర్వహిస్తుంది. అయితే ఇది 60 నుంచి 70% వరకు దెబ్బతిన్న తర్వాత కూడా తిరిగి పెరగడం లేదా పునరుత్పత్తి కావడం దీని ప్రత్యేకత.
ప్రపంచవ్యాప్తంగా కాలేయ వ్యాధుల కారణంగా సంవత్సరానికి 20 లక్షల మంది మరణిస్తున్నారు. వారిలో సిర్రోసిస్ సంబంధిత కారణాలు కేవలం సగం మాత్రమే, మిగిలినవి వైరల్ హెపటైటిస్, హెపాటోసెల్లర్ (కాలేయం) క్యాన్సర్ వల్ల సంభవిస్తాయి. సిర్రోసిస్, కాలేయ క్యాన్సర్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 3.5% మరణాలు సంభవిస్తున్నాయి. మరోవైపు కాలేయ క్యాన్సర్ మరణాల్లో భారతదేశం 10వ స్థానంలో ఉంది.
ప్రపంచ మద్యపాన వినియోగదారుల జనాభా సుమారు 200 కోట్లు. అందులో 7.5 నుంచి 10 కోట్ల మంది మద్యపాన సంబంధిత కాలేయ వ్యాధికి గురయ్యే ప్రమాదం ఉంది. దీంతోపాటు 200 కోట్ల మంది ఊబకాయం/అధిక బరువు కలిగి ఉన్నారు. వారిలో 40 కోట్ల మంది మధుమేహ వ్యాధిగ్రస్తులు, నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD), హెపాటోసెల్లర్ కార్సినోమాకు ప్రమాద కారకాలుగా పరిగణించబడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తప్పనిసరి
ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి
ఒత్తిడిని తగ్గించుకోవడానికి క్రమం తప్పకుండా వ్యాయామం, ధ్యానం చేయడం