KRNL: కౌతాళం మండలం బదినేహల్ గ్రామానికి చెందిన 15 ఏళ్ల పులి మున్నా శుక్రవారం ఆటో బోల్తా పడి మృతి చెందాడు. ఆస్పరి మార్కెట్ లో కూరగాయలు కొనుగోలు చేసేందుకు వెళ్తుండగా చిరుమాన్ డ్డీ వద్ద ఆటో ముందు చక్రం ఊడి బోల్తా పడింది. తీవ్ర గాయాలైన బాలుడిని ఆస్పరి ఆసుపత్రికి తరలించగా వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తికి గాయాలయ్యాయి.