SKLM: కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అభినందించారు. శ్రీకాకుళం ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ని కేంద్ర మంత్రి దత్తత తీసుకుంటానని వెల్లడించడంతో లోకేశ్ ఆయనను అభినందించారు. ప్రభుత్వ పాఠశాలలను వారి ప్రాంతాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, పూర్వ విద్యార్థులు, ఎన్ఆర్ఐలు దత్తత తీసుకుంటే ఆదర్శంగా ఉంటారన్నారు.