WNP: అమరచింత మండల కేంద్రంలోని ప్రైవేటు ఫర్టిలైజర్ షాపుల్లో యూరియా పంపిణీ కొనసాగుతుంది. మండలంలోని ఐదు ప్రైవేటు ఫర్టిలైజర్ షాపులకు యూరియా స్టాక్ వచ్చింది. అమరచింతలోని ఆగ్రో రైతు సేవ కేంద్రంలో రాత్రి స్టాకు రాగా ఉదయ రైతులు యూరియా కోసం క్యూ కట్టారు. యూరియా స్టాక్ ఉందని రైతులు ఆందోళన చెందవద్దని పాసుబుక్ కు 2 బస్తాలు ఇస్తామని ఏవో అరవింద్ తెలిపారు.