MBNR: జడ్చర్ల పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఎక్సైజ్ పోలీసులు రాత్రి వాహనాల తనిఖీల్లో 310 గ్రాముల ఎండు గంజాయిని పట్టుకున్నారు. స్కూటీపై అనుమానాస్పదంగా వస్తున్న ఇద్దరిని తనిఖీ చేయగా, ఈ గంజాయి బయటపడింది. జడ్చర్లకు చెందిన కుమార్ (19), బిహార్‌కు చెందిన బిజేష్(23)ను అరెస్టు చేసి.. వారి నుంచి స్కూటీ, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ విప్లవ రెడ్డి తెలిపారు.