NRML: సారంగాపూర్ మండలంలోని బీరవెల్లి, ఆలూరు గ్రామాల లిఫ్ట్ ఇరిగేషన్ పునరుద్ధరణకు వరుసగా రూ.69.10 లక్షలు, రూ.32.50 లక్షలు మంజూరైనట్లు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి బుధవారం ప్రకటనలో తెలిపారు. ఆలూరు పనుల టెండర్ ప్రక్రియ పూర్తయిందని ఆయన వెల్లడిస్తూ, ఈ పనులు పూర్తి అయితే రైతులకు నీటి సౌకర్యం కలుగుతుందని పేర్కొన్నారు.