W.G: తణుకు పట్టణ పరిధిలోని ఇరగవరం కాలనీ రోడ్డులో నివాసం ఉంటున్న గుడ్డేటి శివరామకృష్ణ (48) గురువారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కారు డ్రైవర్గా పనిచేస్తున్న శివరామకృష్ణ ఇటీవల కాలంలో మద్యానికి బానిస అయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్థాపంతో ఉరి వేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.