KNR: అనుమతి లేకుండా కరీంనగర్ అర్బన్‌లో సెప్టెంబరు 16న ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను మంగళవారం పట్టుకున్నట్లు కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. కరీంనగర్ రూరల్ మండలం గోపాల్ పూర్ క్రాస్ రోడ్ వద్ద ట్రాక్టర్లను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అక్రమ ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.