NZB: రెంజల్ మండలం కందకుర్తి వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా త్రివేణి సంగమంలోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరుతోంది. గోదావరిపై గల వంతెన నీట మునిగే ప్రమాదం ఉన్నందున, అధికారులు బోధన్ – ధర్మాబాద్ వెళ్లే ప్రధాన రహదారిని మూసివేశారు. మహారాష్ట్ర వెళ్లే ప్రయాణికులు బోధన్, బిలోలి గుండా ప్రయాణించాలని సూచించారు.