WGL: వలస కార్మికుడి అదృశ్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన హాల్దీర్ మూడు నెలల కిందట ఇక్కడికి వచ్చి శాయంపేట హవేలీలోని వస్త్రపరిశ్రమలో పనిలో చేరాడు. కొద్దిరోజులు పని చేసిన అతను జూన్ 29 నుంచి కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేశారు.