‘హాయ్ నాన్న’ దర్శకుడు శౌర్యువ్‌తో నేచురల్ స్టార్ నాని మరో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది గత సినిమాకు పూర్తి బిన్నంగా.. పీరియాడిక్ యాక్షన్ డ్రామా కథతో రూపొందనున్నట్లు సమాచారం. వచ్చే ఏడాదిలో ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది. కాగా, ప్రస్తుతం నాని ‘ప్యారడైజ్’ సినిమాతో బిజీగా ఉన్నారు.