E.G: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నిడదవోలు మండలంలోని ఎర్రకాలువ ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో నిడదవోలు నుంచి సింగవరం, తాళ్లపాలెం మీదుగా తాడేపల్లిగూడెం వెళ్లే రహదారి తాత్కాలికంగా మూసివేసినట్లు గ్రామపంచాయతీ అధికారులు తెలిపారు. ప్రయాణికులు సురక్షిత ప్రత్యామ్నాయ మార్గం ద్వారా గమ్యాన్ని చేరుకోవాలని సూచించారు.