ASR: పెదబయలు మండలం గోమంగిని ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేయాలని గోమంగి మండల సాధన సమితి సభ్యులు కోరారు. అరకులో ఎమ్మెల్యే రేగం మత్స్యలింగంను కలిసి వినతిపత్రం అందజేశారు. పరిపాలనా సౌలభ్యం కోసం, ప్రజల వ్యయప్రయాసలు తగ్గించడానికి గోమంగిని మండలంగా ఏర్పాటు చేయాలన్నారు. మండలంలోని అన్ని పంచాయతీలకు మధ్యలో ఉండే గోమంగిని మండలంగా ప్రకటిస్తే ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు.