వాణిజ్య ఒప్పందంపై చర్చించేందుకు అమెరికా అధికారులు ఢిల్లీ వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో స్పందించారు. ప్రధాని మోదీ మంచి ట్వీట్ చేశారని వ్యాఖ్యానించారు. దానికి ట్రంప్ స్పందించారని నవారో పేర్కొన్నారు. ఈ చర్చల్లో వాణిజ్యపరమైన అడ్డంకులను తొలగించడంపై రెండు దేశాలు దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు.