యూపీ(UP)లో శాంతిభద్రతల పరిరక్షణలో సీఎం యోగి (CM Yogi) పూర్తిగా విఫలమయ్యాడని ఎంపీ అసదుద్దీన్ (MP Asaduddin) ఒవైసీ అన్నారు. అతిక్ అహ్మద్ (Atiq Ahmed) సోదరుల హత్యలకు ప్రభుత్వమే కారణమని ఆయన ఆరోపించారు.మరోవైపు అతిక్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్ హత్యలపై ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) కూడా స్పందించారు. యూపీలో నేరాలు తారా స్థాయికి చేరాయన్నారు. నేరగాళ్ల నైతిక స్థైర్యం ఎక్కువగా ఉందని చెప్పారు. పోలీసు (police) సిబ్బంది భద్రత మధ్య కాల్చి చంపబడినప్పుడు సాధారణ ప్రజల భద్రత పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. దీని వల్ల ప్రజల్లో భయాందోళన వాతావరణం ఏర్పడుతోందని తెలిపారు. కొందరు కావాలనే ఇలాంటి వాతావరణాన్ని సృష్టిస్తున్నారనిపిస్తోందని అభిప్రాయపడ్డారు.ఎన్కౌంటర్ (Encounter) రాజ్ని జరుపుకునే వారు కూడా ఈ హత్యకు సమానంగా బాధ్యులన్నారు. హత్యలు జరుపుకునే సమాజంలో నేర న్యాయ వ్యవస్థ వల్ల ఉపయోగం ఏమిటి? అని ప్రశ్నించారు. ఇది కోల్డ్ బ్లడెడ్ మర్డర్ (Cold Blooded Murder) అని, శాంతిభద్రతలపై ప్రశ్నను లేవనెత్తుతోందని ఓవైసీ విమర్శించారు. ఇటువంటి హత్యల కారణంగా దేశ రాజ్యాంగం, లా అండ్ ఆర్డర్ (Law and order)పై ప్రజలకు విశ్వాసం ఉంటుందా అని ఆయన నిలదీశారు.