VSP: అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ అండగా నిలిచారు. 34వ వార్డుకు చెందిన చన్నదాసు అనే వ్యక్తి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుసుకుని, సోమవారం ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. తక్షణ సహాయంగా 5,000 నగదును అందించారు.