GNTR: వెలగపూడి సచివాలయంలో ఇవాళ జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో మంత్రి అనగాని సత్యప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఇంటి నుంచి పేదరికాన్ని పారద్రోలడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు బాటలు వేస్తూ రెవెన్యూ శాఖలో సంస్కరణలు తీసుకువచ్చామన్నారు. తప్పుడు రిజిస్ట్రేషన్లు రద్దుచేసే అధికారం కలెక్టర్లకు కల్పిస్తున్నామని ఆయన తెలిపారు.