KMM: అద్దె భవనాలలో నడుస్తున్న గురుకుల విద్యాలయాలకు సొంత భవనాలు నిర్మించి సౌకర్యాలు కల్పించాలని CPM డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం డిమాండ్ చేశారు. ఇవాళ వైరా మండలం రెబ్బవరం బీసీ వెల్ఫేర్ గురకుల పాఠశాలను ఆయన సందర్శించి విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సొంత భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు.