సత్యసాయి: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మంగళవారం ధర్మవరం పట్టణానికి వచ్చి తన పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు బీజేపీ నాయకుడు హరీశ్ బాబు తెలిపారు. పర్యటన అనంతరం మంగళవారం సాయంత్రం అనంతపురం మీదుగా విజయవాడకు తిరిగి వెళ్లనున్నారని ఆయన వివరించారు.