VZM: చీపురుపల్లి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఈనెల 22 నుంచి అక్టోబరు 2 వరకు శరన్నవరాత్రి మహోత్సవాలను నిర్వ హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా రోజూ అమ్మ వారిని విశేషంగా అలంకరించి, చండీహోమం నిర్వహిస్తారు. 30న దుర్గాష్టమి సందర్భంగా అష్టోత్తర శత కలశాభిషేకం, సామూహిక లక్ష కుంకుమార్చన జరుగుతాయని ఈవో బి.శ్రీనివాస్ తెలిపారు.