కృష్ణా జిల్లాలో గృహ సముదాయాల కోసం ఇప్పటివరకు 19,382 మంది దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా రెవెన్యూ అధికారుల సమాచారం ప్రకారం గుడివాడ డివిజన్లో 3,364 మంది, మచిలీపట్నం డివిజన్లో 6,083 మంది, ఉయ్యూరు డివిజన్లో 9,935 మంది ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించారు. అయితే స్థలాల కేటాయింపు, పట్టాల పంపిణీపై స్పష్టత లేకపోవడంతో దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు.