పాకిస్థాన్‌ను టీమిండియా చిత్తు చేసింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(47*) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో విజయంలో కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ(31), తిలక్ వర్మ(31) మెరుపులు మెరిపించగా, బౌలర్లు పాక్‌ను చావుదెబ్బ కొట్టారు. కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు, అక్షర్ పటేల్, బుమ్రా చెరో 2 వికెట్లు తీశారు. భారత్ విజయం దేశవ్యాప్తంగా సంబరాలను నింపింది.