ASF: జైనూర్ మండలంలోని చింత కర్ర పంచాయతీ పరిధిలోని నాలుగు గ్రామాలకు బీటీ రోడ్డు మంజూరైనా, అటవీ అనుమతులు లేక పనులు నిలిచిపోయాయి. దీంతో ఉన్న మట్టి రోడ్లు కూడా గుంతలమయంగా మారడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆదివారం గ్రామస్తులు కొందరు గుంతలు పూడ్చి మరమ్మత్తులు చేశారు.