MBNR: జడ్చర్లలో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో తల్లిని అసభ్యంగా దూషించడంతో ఆగ్రహించిన తండ్రి నాగయ్య తన సొంత కొడుకు శ్రీధర్ (30)ను కర్రతో కొట్టి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. తండ్రిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.