KNR: చొప్పదండి మండలం రుక్మాపూర్ సైనిక్ స్కూల్లో ఆదివారం హిందీ దివస్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి, గెలుపొందిన వారికి ప్రిన్సిపాల్ జి. కాళహస్తి బహుమతులు అందజేశారు. హిందీ భాష ప్రాముఖ్యతను ప్రిన్సపాల్ వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.