‘మిరాయ్’ సినిమా గురించి దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘కథను వెబ్సిరీస్లా తీసి ఉంటే మరింత డీటెయిల్గా చెప్పేవాడిని. కథకు అడ్డం వస్తున్నాయని రెండు పాటలను తీసేశాం. వైబ్ పాట మాకు ఆప్షనల్. కుదిరితే పెడదాం.. లేకపోతే వద్దనుకున్నాం. పాట విడుదల చేసినప్పుడు ప్రమోషనల్ సాంగ్ అని చెబితే బాగుండు’ అని చెప్పారు.