20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ సురక్షితం కాదంటూ ఇటీవల చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను వ్యక్తిగతంగా లబ్ధిపొందానంటూ వస్తోన్న విమర్శలపై ఆయన స్పందించారు. తన మెదడు విలువ నెలకు రూ.200 కోట్లని, డబ్బుకు ఎలాంటి లోటు లేదని వ్యాఖ్యానించారు. తన ఆలోచనలు రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు తప్ప జేబులు నింపుకొనేందుకు కాదన్నారు.