HYD: కొద్దిపాటి వర్షానికే HYD నగరం అతలాకుతలం అయిందని బీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అన్నారు. రాత్రి తాను ఓ మీటింగ్ వెళ్లాల్సి ఉండగా.. దారిపొడవునా భారీ ట్రాఫిక్ ఏర్పడటంతో చివరికి మెట్రోలో వెళ్లాల్సి వచ్చిందన్నారు. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వెళ్లారు. పదేళ్లు అధికారంలో ఉన్న BRS రోడ్డు డ్రైనేజీ వ్యవస్థను నాశనం చేసిందని, రెండేళ్లుగా కాంగ్రెస్ కూడా పట్టించుకోలేదన్నారు.