TG: ఫార్ములా ఈ రేస్ కేసు కీలక పురోగతి చెందింది. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ సమర్పించిన నివేదిక ప్రస్తుతం విజిలెన్స్ కమిషనర్ వద్దకు చేరింది. నివేదికపై పూర్తి స్థాయి పరిశీలన అనంతరం, దాన్ని గవర్నర్కు పంపనున్నారు. ప్రభుత్వం ఈ నివేదికను గవర్నర్కు త్వరలో పంపించనుంది. కాగా, ఈ ప్రక్రియ పూర్తయితే కేసు తదుపరి దశలోకి వెళ్లే అవకాశం ఉంది.